సమస్యల సుడిగుండంలో నగర ప్రజానీకం

  • సమస్యలపై జనసేన సమరభేరికి విశేష స్పందన
  • వైసీపీ పాలనపై క్షేత్రస్థాయిలో నెలకొన్న ఊహించని ప్రజావ్యతిరేకత
  • జనసేన నాయకుల ముందు సమస్యలను ఏకరువు పెట్టిన ప్రజలు
  • సమస్యల పరిష్కారనికై కృషి చేస్తామని జనసేన నేతల హామీ
  • రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరిన జనసేన నాయకులు నేరేళ్ళ సురేష్, వడ్రాణం మార్కండేయబాబు

గుంటూరు: వైసీపీ నాలుగేళ్ళ పాలనలో ప్రజల జీవన విధానం చిన్నాభిన్నం అయ్యిందని నగర ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని నరకయాతన పడుతున్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం సమస్యలపై జనసేన సమరభేరి కార్యక్రమాన్ని ఆదివారం పాతగుంటూరు మణిహోటల్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు బాలాజీ నగర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళు ఎదురుకుంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా యువత గంజాయి సేవించి పగలు అర్ధరాత్రి అని తేడా లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత శాసనసభ్యులు ముస్తఫా పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మినహా మిగతా సమయంలో తమ ప్రాంతాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని బాలాజీ నగర ఐదవ లైన్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌళిక సదుపాయాల కల్పనలో స్థానిక నేతలు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా సుమారు తొమ్మిది సంవత్సరాలుగా పదవిలో ఉన్నా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేకపోవడం ముస్తఫా పనితీరుకి నిదర్శనమని విమర్శించారు. స్థానిక ఐదో లైన్ ఆరో అడ్డరోడ్డులో రహదారిని పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేసారని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ధ్వజమెత్తారు. బటన్ నొక్కుతున్నాను ప్రజలకి డబ్బులిస్తున్నాను ఇంకేం చేయక్కరలేదు అనుకునే ఒక అసమర్ధుని పాలనలో రాష్ట్రం కొన్నేళ్ళు వెనకబడిపోయిందని దుయ్యబట్టారు. ఒక్కసారి తాడేపల్లి భూత్ బంగాళా వదిలి ప్రజల మధ్యలోకి వస్తే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. ప్రజల్లో నెలకొన్న అగ్రహావేశాలు తెలుసుకాబట్టే పరదాల మాటున, చీరల మాటున ప్రజల కంటబడకుండా ముఖ్యమంత్రి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని సంభందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మార్కండేయ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, నాయబ్ కమాల్, జనసేన పార్టీ 16, డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, 47 డివిజన్ కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మావతి, 3 డివిజన్ అధ్యక్షులు మాధాసు శేఖర్, నగర ఉపాధ్యక్షులు చింతా రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శులు, ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి
ఆళ్ళ హరి, జనసేన పార్టీ మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి మరియు నగర్ కమిటీ సభ్యులు, మరియు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.