శ్రీనివాసరావుతోటలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్

ప్లాస్టిక్ వ్యర్ధాలు మనిషి జీవితంలో పెను భూతంగా మారి, పర్యావరణం మరియు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా కాపాడాలని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మన ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి విముక్తి చేయడానికి శనివారం శ్రీనివాసరావు టోటలో ర్యాలీ నిర్వహించారు. సచివాలయం సిబ్బంది మరియు కూటమి నేతలతో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు మరియు వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను అవగాహన చేసేశారు. ఈ సందర్భంగా, హోటల్స్‌లో వేడి పదార్ధాలను ప్లాస్టిక్ కవర్లపై పెడుతున్న విషయం ఆరోగ్యానికి హానికరమని, ఇలాంటి ప్లాస్టిక్ ప్రవర్తన వల్ల క్యాన్సర్ కూడా రావచ్చని చెప్పారు. అలాగే, వివిధ ఉత్పత్తుల కోసం ప్లాస్టిక్ కవర్ల వాడకం పెరగడం వల్ల ప్రతి ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల గాలి, నీరు మరియు నేల కూడా విషతుల్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై వీధుల్లో చెత్తగా వదిలేసిన ప్లాస్టిక్ ను తినే మూగజీవాలు మరణించిపోతున్నాయని, ఈ ప్రమాదం భవిష్యత్తు తరాలకు కూడా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయకపోతే, మనుషులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని సూచించారు. ప్రజావగాహన పెంపొందించడం ద్వారా ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గేదెల నాగరంగమణి, జనసేన నగర కార్యదర్శి షేక్ మెహబూబ్ బాషా, టీడీపీ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగుర్, బీజేపీ నాయకులు అప్పిశెట్టి రంగారావు, బియ్యం శ్రీను, రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment