మొహరం పండుగకు ముందస్తు శుభ్రత చర్యలు

*సర్వేపల్లిలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు సారథ్యంలో అభినందనీయ కార్యక్రమం

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఏడురోజులపాటు కొనసాగే పీర్ల పండుగలో భాగంగా, పంచాయతీ కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడం వల్ల, ముస్లిం సోదరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గమనించిన బొబ్బేపల్లి, స్వయంగా ముందుకొచ్చి కాలువను శుభ్రపరచించి, బ్లీచింగ్ చేయించి, నాపరాలను పరిపించారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్వంత నిధులతో నిర్వహించినట్లు వెల్లడించిన సురేష్ నాయుడు, “కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో మనం ముందుండాలి,” అని అన్నారు. నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పారిశుద్ధ్య పనులను మరింత బలోపేతం చేయాలని కూటమి తరఫున విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, మణి, రహీం, చిన్న తదితర నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment