కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లాలో నూజివీడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు దుర్మరణం చెందడంపై  ఏపీ సీఎం జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ రోడ్డు ప్రమాదం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ… కుటుంబ జీవనం కోసం పనులకు వెళుతున్న కూలీలు మృత్యువాత పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులు నిరుపేదలని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.