పవన్ కళ్యాణ్ ని చూసి సీఎం జగన్ బుద్ధి తెచ్చుకోవాలి

  • కౌలు రైతుల ఆత్మహత్యలను సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎందుకు ఆపలేక పోతున్నారు?
  • ప్రభుత్వం చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు
  • రైతులకు భరోసా భవిష్యత్తు పై నమ్మకం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం జనసేన రైతు భరోసా యాత్ర
  • సొంత జిల్లా కడపలో కౌలు రైతులను గాలికొదిలేసిన గాలి ముఖ్యమంత్రి సీఎం జగన్

జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆదివారం తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో కౌలు రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయారని అక్కడ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడ్డారని, సీఎం సొంత జిల్లాలో 176 మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరికి కూడా పరిహారం అందించలేదని, ఈ ముఖ్యమంత్రి రైతు ద్రోహని, సీఎం సొంత జిల్లాలో 119 మందికి ఆర్థిక సాయం చేసి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ రైతు పక్షపాతి అని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం పవన్ కళ్యాణ్ గురించి కొనియాడుతున్నారని, సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రైతులకు అండగా నిలబడకపోతే ఇక రాష్ట్ర రైతాంగానికి ఏవిధంగా అండగా నిలబడతారో సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని కౌలు రైతులను పరిహారం తీసుకోకుండా ప్రలోభపెట్టే పనులు చేసినా పవన్ కళ్యాణ్ పై సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో రైతులు ఈ సభకు హాజరయ్యారని, ఈ 3 సంవత్సరాల సీఎం జగన్ పాలనలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరికి కూడా పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని, మూడు వేల మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తు అండగా నిలబడుతున్నారని, రైతు భరోసా ఎగ్గొట్టి ఎందుకు కౌలు రైతుల మధ్య కులాల చిచ్చు పెట్టిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వ సహకారం లేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, కడపలో 60 వేల పైచిలుకు కౌలు రైతులు ఉంటే కేవలం 2500 కార్డులు మాత్రమే ఇచ్చారని ఇంతకన్నా సీఎం జగన్ కు సిగ్గుచేటు ఏముంటుందని, సీఎం జగన్ రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ వారి కన్నీళ్ళు తుడుస్తున్నా గొప్ప మానవతావాది అని, విమర్శలు చేసే వైసిపి నాయకులు మంత్రులు కౌలు రైతులకు ఏడు లక్షల రూపాయల పరిహారం ఎందుకు చెల్లించలేదో ముందు సమాధానం చెప్పాలని, నిజంగా మంత్రులకు సిగ్గుంటే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే పై స్పందించాలని సవాల్ విసిరారు.