ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లేఖ రాశారు. ‘టీకాఉత్సవ్’ కోసం వెంటనే 25 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కోరారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం, వార్డులో టీకాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్న సీఎం.. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల కోవిడ్ డోసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.