పోలవరంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ

ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాసారు. పోలవరంపై ఏడు పేజీల లేఖను ఆయన కేంద్రానికి రాసారు. ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలి అని ఆయన కేంద్రాన్ని కోరారు. పోలవరం నిధుల విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 29 కేబినేట్ తీర్మానాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.