గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవంతో పాటు గవర్నర్‌ పుట్టినరోజు కావడంతో ఆమెకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సహా ఇతర అంశాలను గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం.