ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ.. తక్షణ సాయం 1,350 కోట్లు అందించండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాల తో భాగ్యనగరంతోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి గురువారం సిఎం కెసిఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినందున సాయం అందించాలని కోరారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రకటించారు. కాగా పునరావాసం, సహాయక చర్యల కోసం తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,350 కోట్లు అందించాలని కోరుతూ.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకోని పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాలతో భారీ నష్టం వాటిల్లిందని పలు వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారు.