నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నరసాపురం నియోజకవర్గంలో మంద ఆనంద్ రావుకు సీఎం రిలీఫ్ ఫండ్ (రూ.25000/-), కట్నం వెంకట సూర్యనారాయణ కు సీఎం రిలీఫ్ ఫండ్(రూ.31000/-), తిరుమల స్వాతి కు సీఎం రిలీఫ్ ఫండ్ (రూ.25000/-), పెద్దపాటి కీర్తి (రూ.33614) చెక్కులను అందించి ఆ కుటుంబాలకు అండగా ఉండటం జరిగింది. ఈ నిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని, లబ్ధిదారులను వారి కష్ట కాలంలో ప్రభుత్వం వారితో నిలబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బల మారాజు, గట్టెం శ్రీను, అందే దొరబాబు మరియు నియోజకవర్గ జనసేన- టిడిపి-బిజెపి నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment