రాజోలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 9వ విడత సియంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమము శాసనసభ్యులు దేవ వరప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో 26 బాధిత కుటుంబాలకు రూ.2817498/- మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 147 బాధిత కుటుంబాలకు కోటి 67 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను అని సి.ఎం.ఓ కి నేనే స్వయంగా వెళ్ళి ఎక్కువ మొత్తంలో చెక్కులు మంజూరు సకాలంలో అయ్యే విధంగా చూస్తున్నానని అన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా దీనికోసం ఒక విభాగం ఏర్పాటు చేశానని రోజు 5 నుండి 8 అప్లికేషన్ లు ప్రాసెస్ అవుతున్నాయని తెలిపారు. తద్వారా సకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలబడే అవకాశాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిందని ఈ సందర్భంగా సీఎం మరియు డిప్యూటీ సీఎంలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment