*పేదలకు వైద్య సహాయం – కొవ్వూరు నియోజకవర్గంలో సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 64 లక్షల చెక్కుల పంపిణీ
కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్న మంచి కూటమి ప్రభుత్వం, శుక్రవారం 70 చెక్కుల రూపంలో రూ.64 లక్షలు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో మన ఎమ్ఎల్ఏ ముప్పిడి వేంకటేశ్వరరావు స్వయంగా పాల్గొని, మద్దిపట్ల శివరామకృష్ణ, చౌదరి, చిన్ని, జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్, ఉప్పులూరి చిరంజీవి, వాసిరెడ్డి వేంకటేష్, కన్నప్ప పెరుగు, మడిచర్ల నాగరాజు, పూటి జగదీష్, టిడిపి నాయకులు చంద్రశేఖర్, కిషోర్ తదితర కూటమి పెద్దలు, నాయకుల సమక్షంలో చెక్కులను అందజేశారు. ఈ సహాయ చెల్లింపులు పంగిడి, మలకపల్లి, పెద్దేవం, ధర్మవరం, బ్రహ్మణగుడెం, ఊనగట్ల, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు టౌన్ వంటి గ్రామాలలోని లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమం కొవ్వూరులోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment