*36 కుటుంబాలకు రూ.33.58 లక్షలు సహాయం
రాజోలు నియోజకవర్గంలోని విశ్వేశ్వరాయపురంలో గౌరవ శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.33,58,870 విలువైన చెక్కులను 36 మంది లబ్దిదారులకు శాసనసభ్యులు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 286 బాధిత కుటుంబాలకు సుమారు రూ.2.70 కోట్లు అందించామని పేర్కొన్నారు. బాధితులకు ఈ నిధి చాలా ఉపయోగపడుతోందని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment