కాపులను అవహేళన చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి: పంతం నానాజీ

కాకినాడ: సీఎం జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం పథకం ప్రారంభించడానికి వచ్చి కాపుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించారని జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. స్థానిక కాస్మో పాలిటన్ క్లబ్ లో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ను నేరుగా అడగడలచుకున్నా.. జిల్లాకు వచ్చినప్పుడల్లా ఎందుకు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని ప్రశ్నించారు. కాపులు ఓట్లు అమ్ముకునే వారని వ్యాఖ్యానించారని, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్, ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి కాపుల ఓట్లతో గెలవలేదా అని అన్నారు. గత ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయన్నారు. 2వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్నారు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆస్తులు తాకట్టు పెట్టి నిధులు తెచ్చి పధకాలను నిర్వహిస్తున్నారన్నారు. గొల్లప్రోలు సభలో వాలంటీర్లు, అంగన్వాడీలు బలవంతంగా కూర్చుచున్నారన్నారు. కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం జగన్ లంక గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు మాట్లాడలేదన్నారు. జనసేన పార్టీ వరదబాధితులకు అన్ని రకాలుగా సాయం చేసిందన్నారు. వినతిపత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. జనసేన పార్టీ రెండు సార్లు ఓడినా పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి సీఎం, నాయకులు సరిపోరన్నారు. ఏలేరు కాలువ బాగుచేస్తానని సీఎం అన్నారు.. గతంలో పళ్లంరాజు నిధులు మంజూరు చేశారన్నారు. దీనిని మళ్ళీ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. బటన్ నొక్కే ముందు లిస్టులలో ఉన్న గందరగోళం తొలగిస్తే బాగుండేదన్నారు. సీఎం ను జనసేన ప్రశ్నించే పరిస్థితి దాటిందని, ఇకపై గట్టిగా పోరాడతామన్నారు. వైసీపీ ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, తాటికాయల వీరబాబు, శిరంగు శ్రీను, కొండబాబు, గంగాధర్, యాళ్ల పండు, శంకర్, వీరబాబు, వేణు, కిషోర్, నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.