ఏలూరు బాధిత ప్రజలను పరామర్శించిన సీఎం

పశ్చిమ గోదావరి ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నబాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి జగన్ ఏలూరుకు చేరుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.. బాధితులను పరామర్శించిన తర్వాత అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కాగా అంతుచిక్కని ఈ వ్యాధితో దాదాపు 200 వందలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆదివారం శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి , మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.