సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ

*బాధితుల ఇంటికే వెళ్లిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి, వైద్య చికిత్సల ఖర్చులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) చెక్కులను స్వయంగా బాధితుల ఇంటికే వెళ్లి అందజేశారు. ఈ నిధులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా 18 మంది బాధితులకు రూ.11,04,711 మొత్తం విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కాలిపట్నం, మొగల్తూరు, పెరుపాలెం, పసలదీవి, కె.పి.పాలెం వంటి గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మంజూరైన ఈ నిధులు పేదల ఆశాకిరణంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలందరూ ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిఎం సహాయ నిధిని సమర్థవంతంగా ఉపయోగించి అవసరమైన వారికి అండగా నిలబడతామని బొమ్మిడి నాయకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Share this content:

Post Comment