సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొందిన ఏలేటి సాంబశివరావుకి రూ.15,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. ఈ సహాయం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫారసు మేరకు మంజూరైంది. చెక్కు అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment