పుణ్యక్షేత్రంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం గ్రామంలో, వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్ ) నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సిఫారసుతో మంజూరైన ఈ సహాయాన్ని జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్వయంగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా, పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన నరాల పవన్ గణేష్ కి రూ. 89,761 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందించారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment