పిఠాపురం నియోజకవర్గం: చిత్రాడ గ్రామానికి చెందిన సానా దుర్గా వెంకటలక్ష్మి అనే యువతి కొన్నేళ్లుగా తకయాసు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులుపడుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి సానా దుర్గా వెంకటలక్ష్మి వైద్యానికి సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి రూ.7 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను గురువారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి సోదరుడు ఆదిత్యకు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అందజేశారు. ఆదిత్య మాట్లాడుతూ “ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపడంతో ఎల్.ఓ.సి. వచ్చింది. మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము” అన్నారు.
Share this content:
Post Comment