మొగల్తూరు మండలం, కేపీ పాలెం నార్త్ గ్రామానికి చెందిన యాండ్ర కిరణ్ వెంకట్ అనే బాలుడు గత కొన్ని సంవత్సరాలుగా తలసేమియా అనే అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తీవ్ర ఆర్థిక పరిస్థితుల మధ్య చికిత్స కొనసాగించలేని స్థితిలో ఉన్న ఆ బాలుడు ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హృదయపూర్వకంగా స్పందించి, వెంటనే ప్రభుత్వ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన మొత్తానికి ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, “ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు వారి పక్కన నిలబడటమే నా బాధ్యత. కిరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని పేర్కొన్నారు. కిరణ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే దొరబాబు వెంకటలక్ష్మి, బొడ్డు త్రిమూర్తులు, కదులుపాటి రామకృష్ణ, కందులపాటి బాలాజీ, బొక్క ఏడుకొండలు, బొక్క పెద్ద రాజు, అందే రంగబాబు మరియు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment