దళితబంధుపై సీఎం కీలక నిర్ణయం.. 16 నుంచే అమలు..

దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్‌ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసింది..

హుజూరాబాద్‌ నియోజకవర్గం లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట ప్రారంభం అయినా.. అది ఒకే గ్రామానికి పరిమితం అయ్యింది.. కానీ, ఇప్పుడు హుజురాబాద్‌ నియోజకవర్గం మొత్తం అమలు చేయనున్నారు.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతోంది ప్రభుత్వం.. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది సర్కార్. అయితే, హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని అక్కడ అమలు చేస్తున్నారని. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.