ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం రామరాజ్య స్థాపన దిశగా ముందుకు సాగుతుందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. 15 వ డివిజన్ జనసేన అధ్యక్షులు రాతంశెట్టి జగన్ ఆధ్వర్యంలో ఐపీడీ కాలనీలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనుతో కలిసి అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఆకలితో వచ్చిన ఎంతోమందికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ పేరుతో సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో ముదావహం అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో సహాయపడుతున్నాయన్నారు. కార్పొరేటర్ సంకూరి శ్రీను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని, అయన బాటలో నడవటం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో సూరే శ్రీను, మహేష్, యన్ శ్రీను, సరోజినీ, మంత్రి లోకేష్ కూటమి నేతలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment