మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణం, ఎమ్మెల్యే కార్యాలయంలో, వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు, ప్రభుత్వం అందించే డీజిల్ పై సబ్సిడీ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధికి అన్నివిధాల సహకరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మత్స్యకారుల జీవన స్థితిగతులను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు డీజిల్ పై అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, ప.గో జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు మరియు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment