సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది: కిరణ్ రామిశెట్టి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం జనసేన – క్షేత్ర స్థాయి పర్యటనలలో భాగంగా పాపా నాయుడు పేట పంచాయతీలో పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు పబ్లిక్ టాయిలెట్లు కావాలి, డ్రైనేజి రెగ్యులర్ క్లీనింగ్ జరగడం లేదు కావున అది ప్రతి వార్డులలో జరగాలి దీనితో పాటు డ్రైనేజీ క్లీనింగ్ లో భాగంగా ఎత్తిన మట్టిని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ సహాయంతో ఎత్తివేయాలని. పంచాయతీలో ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తే మంచిదని. పంచాయతీ గ్రంథాలయ నిర్వహణ జరగడం లేదు అది పునరుద్ధరణ చేయాలని. గ్రామ రెవెన్యూ పెంచేందుకు పాత పంచాయతీ కార్యాలయంను ఉపయోగించుకొనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి, ఒకప్పుడు పాపా నాయుడు పేటలో వారాంతపు సంత ప్రతి శుక్రవారం ఏర్పాటు చేసేవారని దానివల్ల అప్పుడు ప్రజల నిత్యావసరాల వస్తువుల ధరల నియంత్రణ జరిగి ప్రజలకు ప్రయోజనం జరిగిందని, ఆ సంత ఏర్పాటు తిరిగి ప్రారంభం చేయాలని తద్వారా ప్రజలకు, పంచాయతీకి ప్రయోజనం చేకూరుతుందని తమ అభిప్రాయం తెలిపారు. జనసేన ఈ సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటికి పరిష్కారం చూపుతుందని, పరిష్కారానికి కావలసిన కార్యాచరణ చేయడం జరుగుతుందని భరోసా ఇవ్వడం జరిగిందని జనసేన పార్టీ ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి తెలిపారు.

Share this content:

Post Comment