*వీరఘట్టం జనసేన పిలుపు
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ గారి అధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ఛలో పిఠాపురం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించేందుకు వీరఘట్టం మండల జనసేన టీమ్ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ, మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వీరఘట్టం మండలం నుంచి ప్రతి గ్రామం నుండి జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు ఈ సభకు వెళ్ళే జనసైనికుల కోసం రవాణా సౌకర్యం, టిఫిన్, భోజనం అన్నీ సమకూర్చి పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటున్నారని తెలిపారు. జనసేన శ్రేణులు పిఠాపురం విజయోత్సవ సభను ఘనంగా విజయవంతం చేయాలని కోరారు. పిఠాపురం సభకు హాజరు కావాలనుకునే వీరఘట్టం మండల జనసైనికులు ఈ నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు. జనసేన జానీ: 8106548607, మత్స పుండరికం (వాలంటీర్): 9441062293, కర్నేన సాయి (టౌన్ నాయకుడు): 8917212351, సిరాపు నాగరాజు: 9966864187. ఈ కార్యక్రమంలో పుప్పాల పురుషోత్తం, కోడివెంకట్ నాయుడు, పొగిరి జగన్, రౌతు నవీన్, రఘమండల గణేష్, దత్తి గోపాల్, మెడిద సందీప్, మజ్జి శ్రీనివాస్, కళ్యాణ్, వినోద్, కుమార్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment