రా.. కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్స్ లో జనవరి 10తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రా.. కదలిరా.. సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ పాలనతో జనమంతా విసిగిపోయారని, ప్రజా పాలన రావాలని గట్టిగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు.