జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరండి!

*ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు

పిఠాపురం చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన యువజన విభాగం అధ్యక్షుడు భైరపోగు సాంబశివుడు పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజల హక్కుల కోసం, సామాజిక మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారని, అలాంటి నాయకత్వాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని, మహబూబ్ నగర్ జిల్లా నుండి భారీ స్థాయిలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖ జనసేన నాయకులు ఎమ్.డి. మహబూబ్, ముకుంద నాయుడు, ఉత్తేజ్, రాజేందర్, కోడిగంటి సాయి, బత్తిని బాలు, మణికంఠ, హనుమంతు, సురేష్, శరత్ గౌడ్, నంద, రాము, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-11-at-4.37.52-PM-1024x683 జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరండి!

Share this content:

Post Comment