సామాన్యుడి పార్టీ “జనసేన”

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచరుడు ఆలోచనాపరడు కానక్కర్లేదు ఆత్మబలం ఉంటే సరిపోతుంది. అతడు విద్యావంతుడు కానక్కర్లేదు త్యాగబుద్ది ఉంటే సరిపోతుంది. అతడు జ్ఞాననిధి కానక్కర్లేదు సేవాతత్పరత ఉంటే సరిపోతుంది. సామాన్యుల్లోని మేధావంతుల పట్ల మన రాజకీయ రంగంలో ఇప్పటి నిర్లక్ష్య వైఖరి ఇదేవిధంగా మిగిలితే మన రాష్ట్రం ఎంత దుర్గతికి లోను కాగలదో ఆ విషయాన్ని తలుచుకోవడానికే భయమేస్తోంది. రాజకీయాలు ధనికులు, వ్యాపారులు, నేరారోపణలు ఉంటేనే రాజకీయ పదవులకు అర్హతగా ఇంకెంతకాలం? రబ్బరు చెప్పులేసుకున్న వాళ్లలో ఉన్న మేధాశక్తి , ప్రజ్ఞాపాఠవాలే వారి కార్యదక్షతే అర్హతలాగా బాధ్యతాయుతమైన ఉన్నత పదవులకు ఆహ్వానించి, వారి సేవా భాగ్యాన్ని పొందడం ఎప్పుడు ప్రారంభమౌతుంది? నోట్ల కట్టలు కాదు ఎన్నికల్ని శాసించేది. పసలేని విమర్శలు కాదు రాజకీయాల్లో కావాల్సింది అని నిరూపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో రబ్బరు చెప్పులు వేసుకున్న సామాన్యులకు అసామాన్య విజయం స్థానిక సంస్థల ఎన్నికల్లో అందించారు పవన్ కళ్యాణ్.

గోపాలకృష్ణ
రాజేంద్రనగర్ నియోజకవర్గం