తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి
  • తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆద్వర్యంలో నిరసన
  • రైతాంగం దుస్దితిపై తహసీల్దారు మహబూబ్ చాంద్ కు వినతి

మదనపల్లె: తుఫాను ధాటికి నష్టపోయిన రైతాంగానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, తుఫాను సమాచారం సైతం రైతుల పట్ల ఉదారంగా ఆదుకోవడంలో విఫలమైందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. ‌తుఫాను దాటికి మదనపల్లె మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను కలసి వివరాలు సేకరించారు. ‌గురువారం మదనపల్లె తహసీల్దారు కార్యాలయం వద్ద రైతుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారు మహబూబ్ చాంద్ తో జనసేన పార్టీ తరుపున రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, జనసేన పార్టీ నాయకులు సమావేశమై రైతుల దుస్దితి వివరించి, వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన రైతాంగాన్ని ఉదారంగా అదుకోవాలని కోరారు. ఆరుగాలం కష్టపడి పంటపండించే రైతులు తీవ్రంగా నష్ట పోయారని వారికి ఎకరాకు రూ.15 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలలోని రైతంగం తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి దెబ్బ తిన్న పంటలు పరిశీలించిన సమయంలో నిమ్మనపల్లె, పొన్నూటిపాలెం, అంకిశెట్టిపల్లె రైతుల దీన అవస్థ కళ్లారా చూడటం జరిగిందని అన్నారు. అగ్రికల్చర్ అధికారులు అప్పుడప్పుడు వెళ్లి చూడటమే కానీ, ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రైతుల దుస్దితి తెలుసుకుని పరామర్శించిన దాఖలు లేదన్నారు. రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం నష్ట పోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని జనసేన పార్టీ తరపున తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. నష్టపోయిన వరి, టమోటా, ఉద్యానవన, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.15 వేలు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, జంగాల గౌతమ్, జయ, నవాజ్, నాగ, లవన్న, జనార్దన్, రాజారెడ్డి, పవన్, నాగవేణి, మజ్జల నవీన్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.