*సామాజిక కార్యకర్త మేకల కృష్ణ
శంఖవరం, ప్రజల ఆరోగ్య భద్రతను పక్కనపెట్టి గ్రామీణ రహదారులపై అడ్డగోలుగా తిరుగుతున్న భారీ టిప్పర్లపై శంఖవరం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మేకల కృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు రెండవసారి ఫిర్యాదు చేశారు. తుని – కత్తిపూడి టి.కె రోడ్డును ఆనుకుని ఉన్న శంఖవరం, రౌతులపూడి మండల గ్రామాల రహదారుల్లో అనుమతులేకుండానే టిప్పర్లు తిరుగుతున్నాయని, ఇవి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని కృష్ణ ఆరోపించారు. సంబంధిత అధికారుల వద్ద సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టిప్పర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అయినా అధికార యంత్రాంగం ఎందుకు గల్లంతవుతున్నదని కృష్ణ ప్రశ్నించారు. అధికార పార్టీ అండతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, ప్రభుత్వ అధికారులు మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించి టిప్పర్ల రాకపోకలు నిలిపివేయకపోతే, ప్రజా వ్యతిరేక టిప్పర్లపై ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
Share this content:
Post Comment