ముసునూరు పోలీస్ స్టేషన్ నందు దువ్వాడ శ్రీనివాస్ పై పిర్యాదు

నూజివీడు, జనసేన పార్టీ అధ్యక్షులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతాలు పార్టీలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ముసునూరు పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ని కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని సెంట్రల్ ఆంధ్ర కమిటి సభ్యులు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, టీడీపి యూనిట్ ఇంచార్జి రంగు శ్రీనివాస్, ముసునూరు మండల జనసేన ఉపాధ్యక్షులు బోట్ల నాగేంద్ర, మండల ప్రధాన కార్యదర్శులు వేట త్రినాధ్, చేబత్తిన విజయ్ కుమార్, గిరి గోపి, ఉప్పే నరేంద్ర, కేశవ, శివ తదితరులు కంప్లైంట్ చేయడం జరిగింది.

Share this content:

Post Comment