జిల్లా, డివిజన్, సెక్షన్ స్దాయి ఆర్ & బి అధికారులపై జనవాణిలో ఫిర్యాదు

శంఖవరం మండలం కత్తిపూడి వయా రౌతులపూడి నుండి తుని వెళ్ళు ఆర్ & బి రోడ్డు సంబంధించిన పికె రోడ్డు పేరుతో పిలవబడే ఆర్ & బి రోడ్డుకు సంబంధించిన శంఖవరం, కొంతంగి, నెల్లిపూడి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఆర్ & బి రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిద్రగన్నేరు, మర్రి, తాడి చెట్లు భారతదేశం స్వతంత్ర్యానికి పూర్వం నుండి నేటికి సజీవంగా ఉన్న చెట్లను ఏ విధమైన ఆర్ & బి అధికారుల, ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా ది:07-02-2025వ తేదిన నరికి వేస్తున్న సందర్భంలో చెట్లు నరికివేతను నిలుపదల చేసి వెంటనే రౌతులపూడి ఆర్ & బి సెక్షన్ జే.ఈ, తుని ఆర్ & బి డివిజన్ డిఇఇ ఫిర్యాదు చేసినా కానీ అక్రమంగా చెట్లు నరికి వేసిన వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ది:10-02-2025వ తేదీన రిజిస్టర్ పోస్ట్లుఎసికె ద్వారా జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా, ఆర్ & బి కాకినాడ సర్కిల్ ఎస్.ఈ ఫిర్యాదు చేసినా కానీ నేటికి అనగా ది:03-03-2025వ తేది వరకు ఆక్రమంగా చెట్లు నరికివేసి సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు కనీసం స్పందించకపోవడంతో ప్రభుత్వాస్థులును పట్టపగలు నాశనం చేస్తే ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేసిన కాని చర్యలు తీసుకొనకపోవడం నన్ను కొంత అసహనానికి గురి చేసింది. ఇది రాష్ట్ర ప్రజాప్రతినిధులు అడవులు, పర్యావరణ శాఖ మంత్రికి, రోడ్డు & భవనాల శాఖ మంత్రికి, రాష్ట్రస్దాయి అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు రోడ్లు & భవనాల శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఆర్ధిక శాఖ వార్లకు పిర్యాదు చేద్దామనే ఉద్దేశంతో 03-03-2025 తేదీ సోమవారం రాష్ట్రరాజధాని అమరావతి మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయంలో కొణిదల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తూన్నా జనసేన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర జనసేన ప్రదాన కార్యదర్శి & రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంఖర్, రాష్ట్ర జనసేన కార్యదర్శి అమ్మిశెట్టి వాసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు సమస్యపై పిర్యాదును రిజిస్టర్ పోస్టు విత్ ఎసికె ద్వారా ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు, ఆర్ & బి శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోడ్లు భవనాల శాఖ, కార్యదర్శి అటవీశాఖ, కార్యదర్శి పర్యావరణ శాఖ, కార్యదర్శి రెవిన్యూ కార్యదర్శులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సచివాలయం, వెలగపూడి పేరున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెక్షన్ స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి ఆర్ అండ్ బి అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం మత్తులోనే ఉండి కలప అక్రమంగా తరలించిన ఆక్రమణదారులకు తగు మద్దతునిస్తూ నేను ఫిర్యాదు చేసిన కానీ ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇప్పటివరకు అనుమతులు లేకుండా చెట్లను నరికివేసిన వారిపై ఏ విధమైన చర్యలు తీసుకుని ఉండలేదొ నాకు అర్థం కావడం లేదు‌‌. బహిరంగంగా పట్టపగలు 3 రోజులు పాటు చెట్లను నరికి వేసిన వ్యక్తులను ఏ ప్రయోజనాల కోసం జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, సెక్షన్ స్థాయి అధికారులు కాపాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అధికారులకు రాబోయే రోజుల్లో ఇది మంచి పద్దతి కాదని, భవిష్యత్తులో అధికారులు, అవినీతిపరుల అవినీతిని ఎల్లప్పుడూ ఎండగడుతూనే ఉంటానని మేకల కృష్ణ జనవాణిలో పిర్యాదు చేసారు.

Share this content:

Post Comment