ఇసుక అక్రమ రవాణాపై స్పందనలో జనసేన నాయకుల ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగట్లేదని గతంలో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన పెద్ద స్థాయి అధికారులు యంత్రాంగానికి గుర్తు చేస్తూ మినగల్లు ఇసుక రీచ్ లని విజిట్ చేసిన జనసేన నాయకులు సోమవారం కలెక్టర్ గారు అందుబాటులోకి లేకపోవడంలో ఇంచార్జ్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈరోజు పేపర్లో 1800 కోట్లు పైన జేపీ కంపెనీకిఫైన్ అనే ప్రకటన చూడటంతో పై చిన్నప్పుడు చదువుకున్న రైమ్ గుర్తొచ్చింది. వైయస్సార్సీపి అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలనుంచి దాదాపుగా 40 సార్లు ఇసుక అక్రమ రవాణా దోపిడీకి గురవుతుందని పలుమార్లు విన్నవించినా అధికారులు చోద్యం చూస్తున్నారు. కానీ ఇప్పటికీ స్పందించన పరిస్థితి లేదు గత వారంలో పెద్ద స్థాయి అధికారులు జిల్లాలో ఇసుక దోపిడీ జరగడం లేదని ప్రకటించడంతో మినగలు రీచ్ ని విసిట్ చేయగా ఒక ప్రదేశానికి జియో టాగింగ్ ఉందని తెలపగా నాలుగు ప్రదేశాల్లో నది గర్భంలో నాలుగు పెద్ద పెద్ద ట్రైన్లతో 20 ట్రక్కులు, దాదాపుగా 40 50 ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా రవాణా తోవి తరలిస్తున్నారు. మరొక్కసారి ఛాన్స్ ఇస్తే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరింత దోచుకు తింటుంది. నదులు దారులు మళ్ళి విపత్తులు వలన పల్లెలను ముంచినా.. భూగర్భజాల జలాలు కనిపించేటట్టు ఇసుక దోపిడీ జరుగుతున్నందున పక్క పొలాలకు నీరు అందకపోయినా వైయస్సార్సీపీ నాయకులు ఆర్థిక లబ్ధి కోసం విచ్చలవిడిగా దోచుకు తింటూనే ఉన్నారు. ఈరోజు 1800 కోట్ల పైన జెపీ కన్స్ట్రక్షన్ కి మాకు సంబంధం లేదు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులదే పాపం అంటూ చేతులు దులుపుకుంటుంది. జరగబోయే ప్రకృతి విపత్తులకు అధికార యంత్రాంగం అంత కూడా సాక్షిభూతాలుగా నిలుస్తారు. తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులైన సిటీ నుంచి పొంగూరు నారాయణ, రూరల్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ప్రజలతో కుటుంబ సమేతంగా మమేకం అవుతుంటే నెల్లూరు సిటీ నుంచి నమ్మకంతో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను అభివృద్ది మరచి మభ్యపెడుతూ నమ్మి తోడు నడిచిన కార్యకర్తల గౌరవాన్ని కాళ్లకాడ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీసుల దగ్గర కూర్చొని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారే కానీ.. జరుగుతున్న దోపిడీని గాని ప్రజా సంక్షేమం గురించి గానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం గెలిచే విధంగా జనసేన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి ప్రజాసంక్షేమానికి అందరూ నడుము బిగించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధామాధవ్, షాజహాన్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, వర, బన్నీ, మౌనిష్, కేశవ, శ్రీను, ఇషాక్, తదితరులు పాల్గొన్నారు.