క్వారీ బాంబు పేలుళ్లపై ఫిర్యాదు..!

పాతపట్నం, మండల కేంద్రం మెళియాపుట్టికి 2 కి.మీ దూరంలోని గ్రామం వద్ద, సమీప క్వారీ యాజమాన్యం శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరిపి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పేలుళ్ల ప్రభావంతో గృహాలు బీటలు వస్తున్నాయి, పంట పొలాలు నాశనమవుతున్నాయి. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే అక్రమ క్వారీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని పాతపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కొరికాన భవాని ఆదేశాల మేరకు, స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు దుక్క బాలరాజు, తిరునగిరి ప్రసాద్ గ్రామ ప్రజలు పత్రి మణికంఠ, కుడితిరి మురళీ, కూర్మపు బాబురావు, కోట శివ కృష్ణ, పిట్ట బాలకృష్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment