పొలమూరు – నౌడురు రోడ్డు దుస్థితిపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, పొలమూరు గ్రామం పర్యటనకు వస్తున్న పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ని జనసేన పార్టీ అధ్వర్యంలో జనసైనికులు రోడ్డుపై ఆపి పొలమూరు – నౌడురు రోడ్డు దుస్థితిపై ఫిర్యాదు చేయడం జరిగింది. సత్వరమే ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.