యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

*అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, కిషోర్ గునుకుల జనసేన

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, కిషోర్ గునుకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలిక రుగ్మతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరు యోగాసనాలు అలవాటు చేసుకోవాలన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనడం దేశానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్.పి కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-21-at-6.44.06-PM-683x1024 యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Share this content:

Post Comment