ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కార్యక్రమాలు పూర్తి చేయండి: తులసి ప్రసాద్

చిత్తూరు, జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనే విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారు, ఈ విషయం మా పార్టీ నిర్ణయం. వైఎస్ఆర్సిపి నాయకుల ఉచిత సలహాలు ఇచ్చేముందు వారు గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో రహదారుల గుంతలను పూడ్చగల్గడం, సంపూర్ణ మద్యపాన నిషేధించడం, సిపిఎస్ రద్దు చేయడం, పోలవరం పూర్తి చేయడం, నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ప్రకటించడం, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు మళ్ళించకుండా వారికే ఖర్చు పెట్టడం, ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి మైనారిటీ యువతకు ఐదు లక్షలు లోన్ ఇవ్వడం, రాష్ట్రంలో పరిశ్రమలను నిర్మించి ఆదాయాన్ని పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులో తీసుకు రావడం వంటి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయగల దమ్ము ఉందా అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ ప్రశ్నించారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో, వారి భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడాలో అనే ప్రణాళికలు జనసేన పార్టీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ విధానంలో మార్పు తీసుకురావడనికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యువతకు దిశానిర్దేశం చేస్తూ, భావితరాలకు సగర్వంగా జీవించేలాగా ఒక సమాజాన్ని నిర్మించడానికి పునాది వేస్తున్నారని తెలియజేశారు.