అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండల తహసిల్దార్ కార్యాలయానికి ఆప్ సబ్ కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ శివ వడ్లమూడి ఆధ్వర్యంలో కంప్యూటర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసు, విఆర్ఓ పడాల, ప్రెసిడెంట్ ప్రత్తి రమణ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిమ్మదాల సురేష్ రంగా, కుర్రెల చక్రవర్తి, సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కంప్యూటర్ బహుకరణ చేయడం పట్ల స్థానిక అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాసేవను మరింత సమర్థంగా అందించేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని తహసిల్దార్ శ్రీనివాసు పేర్కొన్నారు.
Share this content:
Post Comment