తిమిడీ రైతు భరోసా కేంద్రం వద్ద దాన్యం కొనుగోలు చేయాలని జనసేన అధ్వర్యంలో రైతుల ఆందోళన

గత కొన్ని రోజులుగా మధ్య దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని వారు తక్కువ రేటు ఇవ్వటమే కాకుండా తేమ ఎక్కువున్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తిప్పి పంపుతున్నారు. ఎఫ్.సి.ఓ వారు తీసుకోవడంలేదని వారు రైతులతో చెబుతున్నారు. కావున వారు అగ్రికల్చర్ అసిస్ట్నట్ కి రైతులు సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందించారు. వెంటనే 200 మంది రైతులకు ఈ క్రాప్ చేయాలని గ్రామములోని ధాన్యం రైతులను సర్వే చేసి ఎవరు ఎన్ని బస్తాల ధాన్యం ఇస్తారు. ఏరోజుకి ఇస్తారు ఎన్ని గోనెలు కావాలి. తదితర వివరాలు రైతులను అడిగి సర్వే చేయాలని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం తేమను పరీక్షించి రేటు కూడా అర్ బి కే వారు నిర్ణయించి వ్రాసి ఇవ్వాలని. హస్క్ యంత్రలను అర్ బి కే వద్ద ఉంచాలని. ధాన్యం కొనుగోలుచేయడానికి ప్రభుత్వము సత్వర చర్యలు తీసుకోవాలని… దళారుల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని ఆర్ బి కే అసిస్టెంట్ వివేక్ కి వినతిపత్రాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో యస్.కోట జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు సివిల్ సప్లయి తహశీల్దార్ తో ఫోనులో మాట్లాడగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రైతులు పిల్ల సత్యం, పి సన్యాసి నాయుడు, గోకెడ నాయుడు పలువురు రైతులు పాల్గొన్నారు.