రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ డీలర్ల ఆందోళన

జీవో 10ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డీలర్లు పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దిగుమతిని, పంపిణీని నిలిపివేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు. గతంలో ఈ గోనె సంచులను రేషన్‌ డీర్లే అమ్ముకోవడం వల్ల వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడీ గోనే సంచుల్ని ప్రభుత్వమే తీసేసుకుంటుండటంతో డీలర్లు ఆర్థికంగా మరింత నష్టపోతున్నామని వాపోతున్నారు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్‌ షాపుల్ని ఎలా నడపాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఏళ్లతరబడి పేరుకుపోయిన ఎండీఎం, ఐసీడీఎస్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. డీడీ నగదు వాపస్‌, ప్రైస్‌ డిఫరెన్స్‌ సర్క్యులర్‌ అమలు చేయాలని కోరుతున్నారు. డీలరల్కఉ ఏవైనా సమస్యలు ఉంటే చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప , బెదిరింపులకు పాల్పడకూడదని పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తెలిపారు. డీలర్లు బంద్‌ చేసినంత మాత్రాన రేషన్‌ పంపిణీ ఆగిపోదని , ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని, దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదన్నారు. నవంబర్‌ ఒకటవ తేదీన రేషన్‌ యథావిధిగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. రేషన్‌ డీలర్లకు నెలకు పది, పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తోదని, దాంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఇప్పుడు ఈ గోనెసంచుల్ని లాగేసుకోవడంతో ఆదాయం సగానికి సగం పడిపోతుందని, తాము ఎలా బతకాలని రేషన్‌ డీలర్లు ప్రశ్నిస్తున్నారు.