రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద ఫార్మసిస్ట్ అంజలి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం ఐసియూ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అంజలి సూపర్‌వైజర్ దీపక్ ద్వారా వేధింపులు ఎదుర్కోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీపక్‌ను అరెస్ట్ చేయాలని అంజలి బంధువులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆసుపత్రి బయట భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన వల్ల ఆసుపత్రి వద్ద ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం అని గుర్తించారు. ఈ ఘటనపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ అధికారులతో మాట్లాడారు. అంజలి బంధువులు మరియు సంఘాల నినాదాలు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాయి.
Share this content:
Post Comment