వికలాంగుల సమస్యలపై ఆందోళన

  • వికలాంగుల సమస్యలపై భైంసా లో సెప్టెంబర్ 15 తేదీన ఆందోళనకు పిలుపునిచ్చిన వికలాంగుల సంఘం

భైంసా: భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ డిమాండ్ లను తెలిపుతూ సదరం స్లాట్ బుకింగ్ 200 వరకు పెంచాలి, చెవిటి, మూగ అందులకు బస్ పాస్ లు ఇవ్వాలి, అంత్యోదయ కార్డు ద్వారా 30 కిలోల బియ్యం ఇవ్వాలి, బిసి బందు, దళిత బందు, గృహ లక్ష్మి, డబుల్ బెడ్ రూం, తదితర అన్ని సంక్షేమ పథకాల్లో అర్హులను గుర్తించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా100 శాతం వున్న వికలాంగులకు పది వెయిలు పెన్షన్ ఇవ్వాలి, బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, భవిత విద్యా కేంద్రంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని భైంసా పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం దగ్గర శుక్ర వారం ఉదయం 11 గంటలకు వికలాంగులందరు హాజరై కార్యక్రమాన్ని విజయవతం చేయాలని కోరుతున్నాం.