ఇమ్మడి కాశీనాథ్ పాదయాత్ర ముగింపు సభ

పశ్చిమ ప్రకాశం ప్రజల జీవనాడి పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల వాంఛ అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని అలాగే నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ పాదయాత్ర 03/02/2024న వెలుగొండ ప్రాజెక్ట్ శిలా ఫలకం ఏర్పాటు చేసిన డ్యామ్ ప్రాంతంలో ఛలో వెలిగొండ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించడం జరిగినది. ఈ సభలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులోని రెండవ టన్నెల్ మొత్తం పూర్తి అయిందని వైసిపి పశ్చిమ ప్రాంత నేతలు ప్రకటించుకొని రేపోమాపో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చి జాతికి అంకితం చేస్తారని కేవలం రాబోయే ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలను మరోసారి వంచించడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మార్కాపురం నియోజకవర్గం నందు మార్కాపురం పట్టణం మరియు 4 మండలాల గ్రామాలలో పాదయాత్ర చేసి ప్రజలకు జరిగిన వాస్తవాలను అర్థంఅయ్యేలా తెలియజేశారు. అలాగే ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వైసిపి పెద్దలు 12 లక్షలు నిర్వాసితులకు పరిహారం ఇస్తామని గత ప్రభుత్వం తెలియజేయగా మా వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే 18 లక్షలు ఇస్తామని ఓట్లు వేయించుకొని నిర్వాసిత గ్రామ ప్రజలు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నారు. మార్కాపురం జిల్లా చేస్తామని గతంలో మాయ మాటలు చెప్పి మరో సారి పశ్చిమ ప్రకాశ ప్రాంత ప్రజలను వంచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జనసేనపార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, సిపిఐ పార్టీ మార్కాపురం డివిజనల్ కార్యదర్శి అందే నాసరయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సోమయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్, మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీల జిల్లా కార్యదర్శిలు, జిల్లా సంయుక్త కార్యదర్శులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు ముంపు గ్రామాల నిర్వాసితులు పాల్గొనడం జరిగింది.