జనసైనికుని మృతికి సంతాపం

*కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

అమలాపురం, అమలాపురం 6వ వార్డు జనసేన పార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్త గునిశెట్టి అయ్యప్ప ఇటీవల అకాల మరణం చెందారు. ఈ రోజు కలవకొలను వీధిలో ఉన్న ఆయన నివాసాన్ని సందర్శించిన జనసేన అమలాపురం నియోజకవర్గ నాయకులు నల్లా శ్రీధర్, అయ్యప్పకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కాగా, గునిశెట్టి అయ్యప్ప పార్టీ పట్ల తనకున్న నిబద్ధతతో నిరంతరం సేవలందించిన ఓ నిజమైన జనసైనికుడిగా నల్లా శ్రీధర్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment