*సి ఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటికి నిమ్మరాజు వినతి
విజయవాడ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టుల కోసం ఆన్లైన్ శిక్షణా తరగతులతో జర్నలిజం సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించాలని సీఆర్పీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ని సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాలో జర్నలిజం శిక్షణ తరగతులు నిర్వహించామని, తరువాత ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి సహకారంతో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించామని నిమ్మరాజు గుర్తు చేశారు. అయితే అప్పట్లో ఇచ్చిన సర్టిఫికెట్లకు ఆశించిన స్థాయిలో ఉపయోగం లేకపోయిందని, ఆధునిక కాలంలో సెల్ఫోన్ వాడకం తరగతులపై దృష్టి ప్రభావితం చేస్తోందని అన్నారు. అసెంబ్లీ తరహాలో తరగతిగదికి బయట సెల్ఫోన్లు సేకరించడం మంచిదని సూచించారు. ఇక 30 ఏళ్ల క్రితం గుంటూరులో తనతో కలిసి సురేష్ పనిచేసిన గుర్తులను ఈ సందర్భంగా నిమ్మరాజు గుర్తు చేసుకున్నారు.
Share this content:
Post Comment