పవిత్రమయిన రంజాన్ రోజున పరీక్షలు నిర్వహించడం ముస్లింల హక్కులను హరించడమే

చిత్తూరు జిల్లా, 30 రోజుల పాటు ఎంతో క్లిష్టమయినా సరే సహనం, నిష్ఠతో తో ఉపవాసం ఉంటూ చివరగా ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఎంతో ఉల్లాసంతో జరుపుకుంటారు. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయినది. అటువంటి రంజాన్ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యధావిదిగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడును అని సర్క్యులర్ రిలీజ్ చేయడం ఎంతో సిగ్గుచేటు, ఇది ముస్లింల హక్కులను కూలద్రోయటమే. వైస్సార్సీపీ ప్రభుత్వంలో మైనారిటీలను ఒక ఓటర్ గానే చూస్తున్నారు, ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయిన రంజాన్ రోజున నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షను వాయిదా వేయాల్సిందిగా జనసేన పార్టీ తరపున కోరుతున్నానని చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ అన్నారు.