ఘనంగా దేవ వరప్రసాద్ నామినేషన్

రాజోలు నియోజకవర్గ జనసేన టీడీపి బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవ వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేసారు. శనివారం ఉమ్మడి పార్టీల నాయకులతో కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి రాజోలు ఆర్డిఓ ఆఫీస్ నందు వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేసారు. వీరి వెంట తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు ఉన్నారు.