తమ్ముడికి చిరు అభినందన..

కొద్ది రోజుల క్రితం కొవిడ్‌-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా కోవిడ్‌ నుంచి కోలుకున్న నాగబాబు. కొవిడ్‌-19 నెగటివ్ అని తేలాక ఆయన బుధవారం ప్లాస్మా దానం చేశారు. మూడు నెలల పాటు యాంటీ బాడీస్ శరీరంలో పెరుగుతుంటాయి కాబట్టి, ఆరు సార్లు తాను ప్లాస్మాను డొనేట్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆల్రెడీ ఒకసారి డొనేట్ చేశాను కాబట్టి ఎంత లేదన్నా ఇంకో నాలుగు సార్లు ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు అన్నారు.

కాగా తమ్ముడు ప్లాస్మా దానం చేయడంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా సంతోషించారు. ఈ సందర్భంగా తమ్ముడిని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభినందించారు. గురువారం నాగబాబు ప్లాస్మా దానం చేస్తున్న పిక్చర్‌ను షేర్ చేసిన ఆయన, ”కోవిడ్‌ 19తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌లో ప్లాస్మా డొనేట్‌ చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి. ప్లాస్మా దానం చేయండి..” అని చిరు ట్వీట్‌ చేశారు.