జి.రమేష్ కు అభినందన సత్కారం

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె ప్రస్ క్లబ్ అధ్యక్షులుగా జి.రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం మదనపల్లె జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు వారి స్వగృహంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు దారం హరి, హరి హరన్, ఆకుల శంకర, వినయ్ కుమార్ రెడ్డి, హర్ష, వెంకటేష్, అశ్వత్, మదనపల్లె జనసేనాని టీం అధ్యక్షులు గోపాల కృష్ణ, జనసేన ఐటీ విభాగం చంద్రకల తదితరులు పాల్గొన్నారు.