వరద భాదితులను ఆదుకొన్న ఇమ్మడి కాశీనాధ్ కు అభినందన సత్కారం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వరదల వల్ల నష్ట పోయిన వరద భాదితులకు సకాలంలో జనసేన పార్టీ తరుపున నిత్యావసర సరుకులను అందజేసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కి అభినందనలు తెలియజేసిన జిల్లా కార్యదర్శులు, నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీను, ఆది నారాయణ, షేక్.ఖాసిమ్, మాభుఖాన్, అలినేని ప్రసాద్, ఫణి, కొండలు, పిచయ్య, మధు, కళ్యాణ్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.